ఓం నమశ్శివాయ
🙏🙏🙏🙏🙏
*శివానందలహరి.
శ్లోకం 2
గళంతీ శంభో త్వచ్చరితసరితః కిల్బిషరజో
దళంతీ ధీకుల్యాసరణిషు పతంతీ విజయతామ్ |
దిశంతీ సంసారభ్రమణ పరితాపోపశమనం
వసంతీ మచ్చేతోహ్రదభువి శివానందలహరీ || 2 ||
శ్లోకం
పదాన్వయము, అర్ధతాత్పర్యములు -
శంభో!, త్వత్, చరిత, సరితః, గళంతీ, కిలాబిషరజః, దళంతీ, ధీ, కుల్యా, సరణిషు, పతంతీ, సంసార, భ్రమణ, పరితాప, ఉపశమనం, దిశంతీ, మత్, చేతః, హ్రదభువి, వసంతీ, శివానందలహరీ విజయతామ్ !!
శంభో ! = హే శివా, శంభూ,
త్వత్ = నీ యొక్క
చరిత = చరిత్ర అనే (లీలలు, మహిమలు మొ.న)
సరితః = సరస్సు నుండి, నది నుంచి
గళంతీ = జారుచున్నట్టిదియూ
కిల్బిషరజః = పాపములు అనబడే ధూళిని
దళంతీ = పోగొట్టుచున్నది, అణచివేయుచున్నదీ
ధీ = బుద్ధి - మానవుల బుద్ధి అనబడే
కుల్యా = పిల్ల కాలువల యొక్క
సరణిషు = మార్గములందు
పతంతీ = పడుచున్నదై
సంసార = జనన మరణ రూప సంసార చక్రమునందు
భ్రమణ = తిరగడం వలన కలిగే
పరితాప = తీవ్రమైన దుఃఖమునకు
ఉపశమనం = ఉపశాంతిని
దిశంతీ = ఇచ్చుచున్నదీ
మత్ = నా యొక్క
చేతః = చేతస్సు, మనస్సు అనే
హ్రదభువి = మడుగు అనే ప్రదేశము నందు
వసంతీ = నివసించుచున్నది, నిలిచి ఉన్నదియైన
శివానందలహరీ = శివుని యొక్క ఆనంద ప్రవాహము, శివుని ధ్యానించటం వల్ల కలిగే ఆనందము యొక్క ప్రవాహము
విజయతామ్ = విజయము పొందుగాక ! సర్వోత్కృష్టముగా నిలిచి ఉండుగాక !
ఈ శ్లోకములో జగద్గురువు లు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు శివానందలహరి స్తోత్రం యొక్క ఉద్గమస్ధానం గురించి, అంటే ఎక్కడ పుడుతోంది అన్నదానిని గురించి, దాని యొక్క ప్రయోజనం గురించి చెప్పారు. మానవ జీవిత పరమ ప్రయోజనమైన బ్రహ్మానందాన్ని ఎలా పొందగలమో వివరించారు. శావానందలహరి ఈశ్వరుని చరిత్ర అనే సరిత్తు నుంచి పుట్టింది. పరమేశ్వరుని చరితలు, లీలలు, మహిమలు, అసంఖ్యాకులైన శివ భక్తుల గాథలు అనే నది నుండి పుట్టిన శివ ఆనందమనే ప్రవాహము పాపము అనే దుమ్మును ముక్కలు ముక్కలుగా ఛేదిస్తూ, తుడిచి పెట్టేస్తూ, పాప ప్రక్షాళన చేసి, సాధకుల బుద్ధులు అనే పిల్లకాలువలలో నుంచి ప్రవహిస్తూ, ప్రతి చిన్న భావనతో కూడా శివ తత్త్వాన్ని అర్ధం చేసుకోవటానికి వీలు కల్పిస్తూ, అంతరంగాన్ని ప్రక్షాళన చేస్తూ భక్తుని మనస్సు అనే మడుగులోకి ప్రవేశించింది. అక్కడ ఉన్న పరితాపమనే రజోగుణ, తమోగుణ దోషాలను శుద్ధి పరచి, మనస్సుకు ఉపశాంతిని కలిగించి సత్వగుణ వృద్ధి జరగడం ద్వారా శాశ్వతమైన ఆనందాన్ని కలిగిస్తుంది.
ఆచార్యవర్యులు సౌందర్యలహరి, శివానందలహరి స్తోత్రాలలో ప్రతి శ్లోకం లోను ఆ శ్లోకంలో ఏ భావాన్ని చెప్తున్నారో, దానికి తగిన అన్వర్ధమైన సంబోధనతో జగన్మాత ను, జగత్పితను పిలుస్తూ రచించారు. ఈ శ్లోకంలో 'శంభో' అనే పేరుతో పరమేశ్వరుని సంబోధిస్తున్నారు.
'శం సుఖం భవత్యస్మాదితి శంభుః' - ఎవరి వలన నిత్యమైన సుఖము, శుభము, శ్రేయస్సు, బ్రహ్మానందము కలుగుతుందో, అతడు శంభుడు.
హే శంభో ! శివా! నీ సచ్చరిత్రమనే నదిలో నుంచి ప్రవహిస్తూ మాలో ఉన్న పాపములు అనే దుమ్మును, రజస్సులను పోగొడుతూ, నిరంతర సంసార భ్రమణము చేత కలుగుతూన్న తీవ్రమైన పరితాపాన్నుండి ఉపశమనం కలిగిస్తూ, నా హృదయమనే కొలనులో చేరి స్థిరముగా నిలిచి ఉండునటువంటి శివుని ఆనంద కెరటములకు జయమగుగాక !
శంభుడు - శివుడు ఆశ్రితులకు శుభమును కలిగిస్తాడు. శాశ్వతమైన, స్థిరమైన ఆనందాన్ని అనుగ్రహిస్తాడు. శంభుని ఆశ్రయించాలి అనే బుద్ధి శంభుని రూపాన్ని ధ్యానించటం వలన, ఆయన నామాన్ని జపించటం వలన, ఈశ్వరుని గుణ, తత్త్వ, మహిమల స్తోత్రములు వినటం వలన, చదవటం వలన, మననం చేయటం వలన కలుగుతుంది. భక్త మార్కండేయుడు, కన్నప్ప, భక్త సిరియాల్ వంటి భక్తుల చరిత్రలు, శ్రీ, కాళ, హస్తుల చరిత్ర చదవటం వలన, శివుని దివ్య చరిత్రల శ్రవణం వల్ల, శివుని గురించి తెలుసుకోవటం వలన ఆ బుద్ధి స్ధిరపడి ఈశ్వరుని యందున్న ఆసక్తి భక్తిగా మారుతుంది. ఆ భక్తి యొక్క అనుభూతే రసము. 'రసో వై సః'. ఆ రసానుభూతి లోనుంచి ఉద్భవించినదే శివానందలహరి. నదీ ప్రవాహము అక్కడున్న దుమ్ము ధూళులను తన ప్రవాహ వేగంతో తీసుకుని వెళ్ళిపోతూ ఆ స్థలాన్ని శుభ్రపరుస్తుంది. ఎడతెగక ప్రవహించే ఈ శివానంద ప్రవాహము మన మనస్సు లోని, బుద్ధిలోని చెడు భావనలను, చెడువాసనలను, మన పాపాన్నీ పోగొడుతుంది. నిత్యము సత్యము అయిన శివ తత్త్వాన్ని తెలుసుకోలేక పోవటమే పాపము. ఈ దేహమే నేను, ఈ జగత్తే నిత్యము, సత్యము అనుకోవటమే పాపము. మనలోని అంతశ్శత్రువులైన కామక్రోధాదుల ప్రభావమే పాపము. వాటి వలన జనించే రాగద్వేషాలు, అహంకార మమకారాలే కిల్బిషము. శివనామ జపము వలన జనించే శివానందలహరితో పాప ప్రక్షాళన మవుతుంది.
'యమేవైష వృణుతే తేన లభ్యః' కనుక పరమేశ్వరుని అనుగ్రహంతో సంసార భ్రమణ పరితాపము ఉపశమిస్తుంది. పునరపి జననం, పునరపి మరణం అన్న చక్ర భ్రమణం నుంచి బైట పడతాము. పరమాత్మ దర్శనమే ఆనందప్రాప్తి. పరమాత్మ ప్రాప్తికి బాహ్యేంద్రియ శుద్ధి, అంతరింద్రియ శుద్ధి అంటే మనోశుద్ధి రెండు అవసరమే ! చిత్తశుద్ధి వల్ల భ్రాంతి నశించి, అజ్ఞానం ఆవిరయి, అంతఃకరణంలో అంటే మనస్సులో, హృదయంలో పరమాత్మ జ్ఞానం ప్రకాశించి, మానస సరోవరంలో ఆనంద ప్రవాహం ఆవిర్భవించి, నిలిచి ఉంటుంది. అదే శివానందలహరి.
హే శంభో ! శివా ! నా హృదయంలో ఉన్న నీ స్వభావము, స్వరూపమూ అయిన ఆనందపు కెరటాలు నా గళం లో నుండి వాగ్రూపంలో నీ చరితలను కీర్తిస్తూ బైటికొస్తున్నాయి. నీ సచ్చరిత్రమనే నది ప్రవహిస్తూ నాలో ఉన్న పాపములు అనే దుమ్ము కణాలను పోగొడుతూ, మా బుద్ధి అనే సరస్సులో చేరుతుంది. దానివల్ల ఎడతెరిపి లేని జనన మరణాలనే ఈ సంసారచక్ర భ్రమణం వల్ల కలిగే తీవ్ర పరితాపానికి ఉపశమనం కలుగుతుంది. దానివల్ల నా బుద్ధి అనే - నా హృదయము అనే హ్రదము లో శివ ఆనంద లహరులు పెల్లుబుకుతాయి. అటువంటి శివానంద లహరికి జయమగుగాక !
తరించటానికి మొదటి సోపానం భగవత్కథా శ్రవణం. భగవంతుని కథలు వినటం వల్ల, పరమాత్మ మహిమలు తెలుసుకోవటం వల్ల భగవంతుని మీద ప్రీతి ఏర్పడుతుంది. విన్నదానిని మననం చేసుకోవాలి. ఆ కథలలో, లీలలలో ఉన్న తత్త్వాన్ని గురించి ఆలోచించాలి. అప్పుడు భక్తితో నోరారా పరమాత్మ లీలలను గానం చెయ్యాలి. దాంతో భగవంతుని సేవించాలి, పూజించాలి అనే ఇచ్ఛ కలుగుతుంది. భగవంతుని పూజించి, సేవించి, నమస్కరించి, మనను మనం పరమాత్మ కు అర్పించుకోవాలి. అప్పుడు మన హృదయం లోపలి నుంచి ఉప్పొంగే శివ భావనతో కలిగిన ఆనంద గంగా ప్రవాహ లహరి శివానందలహరి అవుతుంది. పరమశివ భావనే ఆనంద లహరి.
భూకైలాస్ లాంటి, గిరిజా కళ్యాణం, శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యం లాంటి సినిమాలు చూస్తుంటేనే, భక్తి తన్మయత్వంతో మనసు ఆర్ద్రమై, కన్నీరు నిరవధికంగా ప్రవహిస్తుందే, మరి భావనతో, అర్చనతో, మంత్ర జపంతో పరమేశ్వరుని ఆరాధించి, భావించటం మాత్రమే కాకుండా ప్రత్యక్షంగా అనుభవిస్తున్న భావన పొందినప్పుడు ఆ జన్మ ఎంత ధన్యమైనది ! అలా దర్శించ గలిగినప్పుడు మనలో నుంచి బైటకు వచ్చే ప్రతి పదమూ శివానందలహరే ! సినిమాలు, నాటకాలు చూసినప్పుడు కలిగే భక్తి భావన కొద్ది సేపే ఉంటుంది. కానీ అదే మనసు భక్తికి అలవాటు పడితే, అనుక్షణమూ భక్తి రసంలో ఓలలాడటమే ! నిరంతర భగవద్ధ్యానం వల్ల పరమాత్మను ప్రత్యక్షంగా అనుభవిస్తున్న భావనకే అంత పరవశించిపోతే, మరి ప్రహ్లాదుని లాంటి భక్తులు పరమాత్మను అనుభవిస్తున్నది భావన కాదు, నిజంగానే అనుక్షణమూ పరమాత్మను దర్శించాడు. సర్వత్రా పరమాత్మ నే దర్శించాడు. అతనికి సర్వమూ పరమాత్మే అయింది. అది పుట్టుకతో అతనిలో వచ్చిన సహజ భక్తి,అనన్య భక్తి. అలాంటి భక్తితో శివుని భజిస్తున్నప్పుడు ఆ భక్తుని పలుకులే శివానందలహరి !
శివా శివా శివా అని తన్మయత్వంతో స్మరిస్తూ ఉంటే, తనువు మనస్సు పరవశించి హృదయం లోంచి ఆనందం ఉప్పొంగుతుంది. అలా పరబ్రహ్మానుభూతితో అనుభవిస్తున్న అవిచ్ఛిన్న ఆనంద ప్రవాహమే శివానందలహరి. వసంతీ మచ్చేతో హ్రద భువి శివానంద లహరీ. చేతో హ్రదము - మనస్సనే చెరువు. అందులో
నివసిస్తున్న శివ చైతన్య ము. ఇది పరబ్రహ్మ పాదారవింద స్మరణ వల్ల లభించే ఆనందం, మానవ జీవిత చరమ లక్ష్యం.
🙏🙏🙏🌹
డా. టి (ఎస్) విశాలాక్షి

* మానవ జీవిత పరమ ప్రయోజనమైన బ్రహ్మానందాన్ని ఎలా పొందగలమో వివరించారు. శావానందలహరి ఈశ్వరుని చరిత్ర అనే సరిత్తు నుంచి పుట్టింది. *
ReplyDeleteపై న రాసిన దానిలో అచ్చు తప్పు ఉంది. శావానందలహరి కాదు శివానంద లహరి సరిద్దిదేది.
****************
రసో వై సహ గురించి వెతుకుతూంటే మీ బ్లాగు కనపడింది
వ్యాసాలు చాలా బాగా రాశారు.