ఓం నమశ్శివాయ
శివానందహరి
శ్లోకం 3
త్రయీవేద్యం హృద్యం త్రిపురహర మాద్యం త్రినయనం
జటాభారోదారం చలదురగహారం మృగధరమ్ !
మహాదేవం దేవం మయి సదయభావం పశుపతిం
చిదాలంబం సాంబం శివ మతివిడంబం హృది భజే || 3 ||
శ్లోకం
పదాన్వయము - అర్ధములు.
త్రయీ, వేద్యం, హృద్యం, త్రిపుర, హరం, ఆద్యం, త్రినయనం, జటాభార, ఉదారం, చలత్, ఉరగ, హారం, మృగధరం, మహాదేవం, దేవం, మయి, సదయ భావం, పశుపతిం, చిత్ + ఆలంబం, స+ అంబం, శివం, అతి విడంబం, హృది, భజే.
త్రయీ = మూడు వేదములద్వారా
వేద్యం = తెలుసుకొన బడువాడు
హృద్యం = హృదయమునకు ప్రియమైనవాడు
త్రిపుర = మూడు పురములను( రాక్షసులను)
హరం = సంహరించినటు వంటివాడు. త్రిపురాంతకుడు, శివుడు.
ఆద్యం = ఆద్యుడు, సృష్టికి ముందున్నవాడు
త్రినయనం = మూడు కన్నులున్నవాడు
జటా = జడల యొక్క
భార = బరువు చేత
ఉదారం = గంభీరమైనవాడు.
విస్తారమైన జటాజూటము కలవాడు
చలత్ = కదులుతున్న
ఉరగ = పాములను
హారం = హారముగా కలిగినవాడు.
కదులుతున్న సర్పములే ఆభరణములుగా కలవాడు
మృగధరం = లేడిని చేతిలో ధరించినవాడు
మహాదేవం = గొప్ప దేవుడిని, దేవాధిదేవుడిని
దేవం = స్వయం ప్రకాశకుడైన, ఆనంద స్వరూపుడైన వానిని
మయి = నా యందు
సదయ భావం = దయతో కూడిన భావన కలవాడిని
పశుపతిం = సర్వజీవులకు ప్రభువైనవాడిని
చిత్ + ఆలంబం = జ్ఞానమునకు ఆధారమైనవాడిని
స + అమ్బం = (ఎల్లప్పుడూ) అంబికతో కలిసి యుండువాడు
శివం = సర్వ మంగళ స్వరూపుడు, మంగళ ప్రదాత అయిన వానిని
అతి విడమ్బం = నటనలో (లేదా అనుకరించుటలో) అత్యద్భుతమైన ప్రజ్ఞ కలవాడిని అయిన పరమేశ్వరుడిని
హృది = హృదయము నందు
భజే = భజించుచున్నాను. ధ్యానించుచున్నాను.
వేదములద్వారా తెలిసికొన దగిన వాడును, మిక్కిలి మనోహరమయిన ఆకారము కలవాడును, త్రిపురములనూ (త్రిపురాసురులను) సంహరించినవాడును, సృష్టికి పూర్వమే ఉన్నవాడును, మూడుకన్నులు కలవాడును, గొప్ప జటాజూటము కలవాడును, ఉదార స్వభావం కలవాడునూ, కదులుచున్న సర్పములను ఆభరణములుగా ధరించి నటువంటి వాడును, లేడిని ధరించిన వాడునూ , దేవతలకే దేవుడయిన మహాదేవుడునూ, సకల జీవులకూ పతి అయినవాడును , జ్ఞానమునకు ఆధారమయిన వాడును, అనుకరింప శక్యము కానివాడును, నాయందు దయ కల వాడును అయిన పార్వతీ సమేతుడయిన ఈశ్వరుడిని నా హృదయమునందు ధ్యానించుచున్నాను.
త్రయీవేద్యం - వేదత్రయము చేత తెలియబడుచున్నవాడు - అనగా - నాలుగు వేదములలోని ఋక్కులు, యజుస్సులు, సామములు అనబడే మూడింటి చేత తెలియ బరచ బడుతున్న, స్తోత్రము చేయబడుతున్న పరమాత్మ ఈశ్వరుడే ! ఆయన వేద వేద్యుడు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ - ' వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః' అని చెప్పాడు.
హృద్యం - అంటే హృదయంలో అభివ్యక్త మయేవాడు, హృదయంగమంగా ఉన్నటువంటివాడు, హృదయానికి ఆనందం కలిగించేవాడు. 'ఈశ్వరస్సర్వ భూతానాం హృద్దే2శేర్జున తిష్టతి' అని పరమాత్మ సర్వ ప్రాణికోటి హృదయాలలో ఉన్నాడని శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు. ఈశ్వరునికి రౌద్ర రూపం, హృద్య - ప్రసన్న రూపం - రెండు ఉంటాయి. మనకు ఆ రెండు రూపాలు కావాలి. హృద్యం అంటే హృదయం చేత అనగా ప్రేమ చేత పొందదగిన వాడు. భగవానుడు ప్రేమకి, భక్తికి లొంగిపోతాడు. శ్రీకృష్ణుడు గోపికల ప్రేమకు లొంగిపోయాడు, యశోదమాత ప్రేమకు లొంగి పోయి, రోలుకు కట్టించుకున్నాడు.
' నా2యమాత్మా ప్రవచనేన లభ్యో, న మేథయా, న బహునా శ్రుతేన అంటుంది వేదం.
త్రిపురహరం - త్రిపురాసురులను సంహరించినటువంటి వాడు - రౌప్యాయస హిరణ్య నగరాలకు నాయకులైన త్రిపురాసురులనే రాక్షసులను సంహరించటమంటే, మనలోని త్రితయాన్ని నిర్మూలించటమే ! స్థూల సూక్ష్మ కారణ శరీరాలను తొలగజేసి, జాగ్రత్ స్వప్న సుషుప్త్యవస్థలకు అతీతమైన తురీయమును కలిగించే, భూతభవిష్యద్వర్తమానాలకు అతీతమైన కాలాతీత స్వరూపుడై ప్రకాశించే, జ్ఞాత జ్ఞానము జ్ఞేయము అనే త్రిపుటిని ఏకం చేసే పరమాత్మ, బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథులను భేదించే త్రిపుర హరుడు శివుడు.
ఆద్యం - ఆది దైవమైన, సృష్టికి ముందు ఉన్నటువంటి మూల శక్తి అయి, సృష్టిలో స్థితిలో, లయకాలం లోనూ ఉన్న ఆదిదైవము సదాశివుడు.
త్రినయనం - మూడు కన్నులు కలిగిన ముక్కంటి. సోమసూర్యాగ్ని లోచనుడు. 'అగ్నిసోమాత్మకం జగత్' ! సృష్టి అంతా అగ్ని వల్ల, చంద్రుని వల్ల అంటే వెలుగు వేడిమి వల్ల, చల్లదనం, అమృతత్త్వం - జలం వల్ల సాగుతోంది. ప్రపంచమంతా వేడిమి, చల్లదనం వల్లే సాగుతోంది. మనకు ప్రత్యక్ష భగవానుడు శ్రీ సూర్యనారాయణ స్వామి. ఆయన సర్వ దేవాత్మకుడు. ఏ దైవాన్నైనా సూర్యమండలంలో భావించి ఉపాసన చెయ్యాలి. సూర్యభగవానుని వల్లే జీవము ఉద్భవిస్తోంది, పోషింపబడుతోంది. అటువంటి సూర్యుడు శివునికి ఒక కన్ను.
'ఓం నమశ్శివాయ సాంబాయ సగుణాయాది హేతవే !
రుద్రాయ విష్ణవే తుభ్యం బ్రహ్మణే సూర్యమూర్తయే' !! అనేది ఒక మహా మంత్రం.
ఇక రెండవ కన్ను చంద్రుడు, సమస్త ఓషధులకు అధిపతి, అమృత కిరణుడు, మనస్సుకు అధిదైవము, మనస్సుకు కారకుడు. అటువంటి చంద్రుడు శివునికి రెండవ కన్ను. ఈశ్వరుని మూడవ కన్ను అగ్నిదేవుడు. మనది యజ్ఞ సంస్కృతి. మనము అగ్ని ఆరాధకులము. యజ్ఞం చెయ్యాలంటే ముఖ్యంగా కావలసినది అగ్ని. అరణి మథించి అగ్ని రగిల్చి చేసే హోమంలో సర్వ దేవతలకు సమర్పించే హవిస్సులను దేవతలకు అందజేసేది అగ్నిహోత్రుడే !
అగ్ని ముఖా వై దేవాః అన్నది వేదం ! 'అగ్నిమిచ్ఛధ్వం భారతాః' అన్నారు మహర్షులు.
ఈశ్వరుడు జటాజూటధారి, కపర్ది. పరమ పావనమైన గంగాభవానీ దేవిని ధరించిన జటాజూటాన్ని స్మరిస్తే, మన ఆజ్ఞానం పోతుంది. అనంతమైన ఆకాశమే ఈశ్వరుని జటాజూటము.
చలదురగహారం - కదులుతున్న పాములను ఆభరణములుగా ధరించినవాడు. పాములు యోగశక్తికి ప్రతీకలు. సర్పములు కుండలినీ శక్తికి ప్రతీకలు. నాగులు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతీకలు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వంశ వృద్ధి కరుడు. కుండలినీ శక్తిని తన వశమందుంచుకుని, తన నారాధించిన భక్తులకు, సాధకులకు, యోగులకు వారిలోని కుండలినీ శక్తిని జాగృతపరచి, సహస్రారంలో ఉన్న సాంబసదాశివుని ప్రాప్తింపజేస్తాడు మహేశ్వరుడు. ఈశ్వరుడు.
జటాభారోదారం అంటే
ఉదారమైన - అతి విస్తృతమైన కపర్దము కలవాడు. శివుని ' వ్యోమకేశుడు' అంటారు. అనంతమైన ఆకాశమే జటాజూటముగా కలిగినవాడు.
మృగధరుడు. మృగము - జింక, బెదురు కన్నులు కలది, చపలత్వానికి ప్రతీక ! జింకను ధరిస్తాడు అంటే, మనో చపలత్వాన్ని అదుపు చేస్తాడని అర్ధం. కనుక మనో నిగ్రహానికి ప్రతీక ! మృగములు అంటే మనలోని బలహీనతలు, పశుగుణాలు. శివుడు మృగధరుడు. మనలోని మనోవికారాలనే జంతువులను అదిమి పట్టి, వాటిని నిర్మూలిస్తాడు. శివుడు మహాదేవుడు. దేవతలకు కూడా ఆయనే దేవుడు కనుక మహాదేవుడు. ఒక్క ఈశ్వరుడినే మహాదేవుడంటారు.
" తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి, తన్నో రుద్రః ప్రచోదయాత్" అని వేదంలో ఉంది. మహాదేవుడు దేశ కాల వస్త్వపరిచ్ఛిన్నుడు.
ఆయనే దేవుడు. దేవుడు అంటే ప్రకాశించే వాడు, కాంతిమంతుడు. దేవతలనే పదం 'దివ్' అనే ధాతువు నుంచి వచ్చింది.
'దివు క్రీడా విజిగీషా వ్యవహార ద్యుతి స్తుతి స్వప్న మోద మద కాంతి గతిషు' అని దివ్ ధాతువునకు అర్ధాలున్నాయి. ఈ పనులన్నీ చేసేవాడు దేవుడు. ఆటలాడేవాడు,
జయించాలనే కోరిక కలిగి ఉండేవాడు,
లోక వ్యవహారాలన్నీ చేసేవాడు, కాంతి కలవాడు, స్తుతింపబడేవాడు, స్తుతించేవాడు, కలలు కనేవాడు, ఆనందించేవాడు, మదము కలిగినవాడు, కాంతి కలవాడు, గమనశీలం కలవాడు - ఈ లక్షణాలన్నీ ఉన్నవాడు దేవుడు. శివుడు దేవుడు, ఇటువంటి దేవతలకు కూడా దేవుడు కనుక దేవదేవుడు.
ఆయనే పశుపతి - పశువులకు పతి. జీవులందరూ కాలపాశ బద్ధులే ! బంధింపబడినవారందరూ పశువులే ! ఈ పశువులు ఎవరి వశంలో ఉన్నాయో ఆయన పశుపతి.
ఈశ్వరుడు చిదాలంబుడు, జ్ఞానస్వరూపుడు. సాంబుడు. చిత్ కి, చైతన్యానికి ఆధారమైనవాడు, చైతన్య స్వరూపుడు. విశ్వమంతా ఉన్న చైతన్యమే పరమేశ్వరుడు. ఆయన సాంబుడు అంటే అంబతో - అమ్మవారితో కలిసి ఉన్నవాడు. శివుని అవినాభావ శక్తే పార్వతీదేవి. శివుడు ఎప్పుడూ శక్తితో కూడి ఉంటాడు. అందుకే ఆయన అర్ధనారీశ్వరుడు.
శివమ్ అంటే శివుడిని, శివుడు అంటే మంగళకథకుడు. శివః అనే నామము చాలా శక్తిమంతమైనది. 'శివః శామ్యతి పరమానంద రూపత్వాత్ నిర్వికారో భవతి ఇతి శివః'
శివుడు నిర్వికారుడు, శాంత స్వరూపుడు, పరమానంద స్వరూపుడు.
' ప్రపంచోపశమం శాంతం శివమద్వైతం' అనిఉపనిషత్తు చెప్పిన తత్త్వమే శివుడు.
శివమహిమ్న స్తోత్రంలో శివుడు స్మశానవాసియైనా, చితాభస్మం పూసుకుని, కపాల మాలలు ధరించినా, ఆయనను సేవించేవారికి ఆయన గొప్ప మంగళములనే ప్రసాదిస్తాడని చెప్పారు.
" స్మశానేష్వాక్రీడా స్మరహర పిశాచాస్సహచరాః
చితాభస్మాలేపః స్రగపి సృకరోటీ పరికరః !
అమంగల్యం శీలం తల భవతు నామైవ మనకి మ్
తథా2పి స్మర్తౄణాం వరద ! పరం మంగళమసి"!!
అతి విడంబం అన్నారు శివుడిని. అంటే అత్యంత చతురత కలవాడు, చక్కగా నటించగలవాడు. శ్రీరుద్రంలో నమక మంత్రాలలో చెప్పినట్లుగా సృష్టిలోని సర్వ రూపాలు తానే అయి, మనలను అనుగ్రహిస్తున్నాడు.
ఎవరి దృష్టి ఎప్పుడూ శివుని మీద ఉంటుందో వారు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారు
అటువంటి శివుడు నా మీద ఎల్లప్పుడూ అత్యంత దయతో ఉంటాడు. ఎందుకంటే, నేను ఎల్లప్పుడూ ఆయనను నా హృదయంలోనే నిలిపి ఆరాధిస్తూ ఉంటాను.
సర్వ భూతముల హృదయాలలో నివసించేది ఈశ్వరుడే !
" నీల తోయద మధ్యస్ధా, విద్యుల్లేఖేవ భాస్వరా, నీవారశూకవత్తన్వీ, పీతా భాస్వత్యణూపమా
తస్యాశ్శిఖాయామధ్యే పరమాత్మా వ్యవస్థితః ! స బ్రహ్మ, స శివః .."అని వేదం చెబుతోంది. కనుక అటువంటి ఈశ్వరుడిని ఎల్లప్పుడూ నా హృదయంలోనే నిలిపి భజిస్తాను అని జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు చెప్తున్నారు. మనం కూడా ఇలాగే భావించాలి.
🙏🙏🙏🌹
డా.విశాలాక్షి.

No comments:
Post a Comment