ఓం నమశ్శివాయ
శివానందలహరి
శ్లోకం 4
సహస్రం వర్తంతే జగతి విబుధాః క్షుద్ర ఫలదాః
న మన్యే స్వప్నే వా తదనుసరణం తత్కృత ఫలమ్ |
హరిబ్రహ్మాదీనామపి నికటభాజా మసులభం
చిరం యాచే శంభో శివ తవ పదాంభోజ భజనమ్ || 4 ||
శ్లోకం
పదాన్వయము, అర్ధములు, భావము.
శంభో, జగతి, క్షుద్రఫలదాః, విబుధాః, సహస్రం, వర్తన్తే, స్వప్నే వా, తత్, అనుసరణం, వా, తత్కృత, ఫలం, న మన్యే, శివ, నికట భాజాం, హరి బ్రహ్మాదీనాం అపి, అసులభం, తవ, పద+ అంభోజ, భజనం, చిరం, యాచే.
శంభో = హే శంభో,
జగతి = ఈ జగత్తులో
క్షుద్రఫలదాః = అల్పమైన ఫలములను అనుగ్రహించే వారు
విబుధాః = దేవతలు
సహస్రం = అసంఖ్యాకముగా
వర్తంతే = ఉన్నారు.
స్వప్నే వా = కనీసం కలలోనైనా
తత్ = వారిని
అనుసరణం = అనుసరించాలని కానీ
తత్ కృత = లేదా, వారు ప్రసాదించగల
ఫలం = ఫలములను గురించి గానీ
న మన్యే = నేను పరిగణించను.
శివ = ఓ ఈశ్వరా ! పరమ మంగళ స్వరూపా !
నికట భాజాం = నీ సమీపములోనే ఉన్న
హరి బ్రహ్మ + ఆదీనాం అపి = హరి బ్రహ్మాదుల వంటివారికి కూడా
అసులభం = సులభంగా లభించని
తవ = నీ
పదాంభోజ = పాదకమలముల యొక్క
భజనం = సేవను
చిరం = నిరంతరమూ
యాచే = యాచించుచున్నాను.
జగద్గురువులు ఈ శ్లోకంలో, సర్వ దేవతల కంటే, శివుడే గొప్పవాడనీ, ఆయన పాదసేవ చేసే భాగ్యం
కలిగించమనీ శివుడినే ప్రార్ధిస్తున్నారు.
లౌకికమైన చిన్న చిన్న కోరికలను తీర్చేటటువంటి వేలమంది దేవతలున్నారు. వారు ఇవ్వగలిగేవన్నీ అల్పమైనవే ! కలలోనైనా ఆ దేవతలను భజించుటగానీ, ఆ దేవతలు కలుగచేయు ఫలమును గానీ నేను ఆశించను. శుభంకరుడవగు ఓ శంకరా ! ఏ నీ పాదపద్మాలను చేరటం సాక్షాత్తుగా బ్రహ్మ దేవునికి కానీ, శ్రీ మహా విష్ణువునకు కూడా సాధ్యం కాదో, అటువంటి నీ పాదపద్మాలనే నేను భజించుట కొరకు యాచిస్తాను. నీ పాదసేవయే నాకు అనుగ్రహించమని పదేపదే వేడుకొనుచున్నాను, అని జగద్గురువులు ప్రార్థన చేస్తున్నారు. మనం కూడా అలాగే చెయ్యాలి.
సాధారణంగా దేవతలకు ఐహికమైన, ఆముష్మికమైన కోర్కెలను తీర్చగల శక్తి మాత్రమే ఉంటుంది. కానీ మోక్షాన్ని ఇవ్వగల శక్తి ఉండదు. అది కేవలం పరమాత్మకు మాత్రమే ఉంటుంది. ఎవరు తపస్సు చేసినా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరాలను అనుగ్రహిస్తాడు. ఎవరైనా శాశ్వతత్వాన్ని అడిగితే, అది నాకే లేదు. ఈ కల్పం తరువాత నేనే ఉండను. నేనెలా ఇవ్వగలను ? అంటాడు. మానవుల బాధలను దేవతలు తీరుస్తారు. దేవతలకు బాధలు కలిగితే, బ్రహ్మ దేవుడు తీరుస్తాడు. ఎప్పుడైనా బ్రహ్మ దేవునికి కూడా సాధ్యం కాకపోతే, అందరూ కలిసి శ్రీమహా విష్ణువును ప్రార్థిస్తారు. శ్రీమహావిష్ణువు రాక్షస సంహారం చేసి, దేవతల కష్టాలను పోగొడతాడు. అలాంటి శ్రీ మహావిష్ణువుకు కూడా కనుక ఎప్పుడైనా అసాధ్యమైతే, అప్పుడు వారందరూ కలిసి వచ్చి ఈశ్వరుడిని ప్రార్ధిస్తారు. అలా అందరూ ప్రార్ధించినప్పుడు మహేశ్వరుడు త్రిపురాసుర సంహారం చేసి, సర్వ లోకాలను రక్షించాడు.
వ్యాఘ్రపాద మహర్షికి ఉపమన్యువు, ధౌమ్యుడు అనే ఇద్దరు కుమారులున్నారు. ఉపమన్యువు బాలుడుగా ఉన్నప్పుడు అతని తండ్రి ఒక యాగానికి వెళుతూ కొడుకును కూడా తీసుకుని వెళ్ళారు. అక్కడ ఆ బాలునికి మధురమైన ఆవుపాలతో చేసిన పాయసం పెట్టారు. ఇంటికి వచ్చాక ఆ బాలుడు వాళ్ళ అమ్మను పాయసం కావాలని, పాలు కావాలనీ అడుగుతాడు. వారి వద్ద ఆవు లేనందువల్ల, పేదరికం వల్ల ఆవిడ నీళ్ళల్లో బియ్యం పిండి కలిపి ఇస్తుంది. ఇవి కాదనీ తాను తాగిన మధురమైన పాలు కావాలనీ అడుగుతాడు ఆ బాలుడు. ఆవిడ నాయనా ! ఏది కావాలన్నా ఈశ్వరుడే ఇవ్వాలి. శివుడిని ఉపాశించమని చెప్తుంది. ఈశ్వరుడివ్వాలి, ఇల్లు నిండాలి అంటారు. వెంటనే ఉపమన్యువు తల్లితండ్రుల అనుమతి తీసుకుని, అరణ్యాలకు వెళ్ళి, ఈశ్వరుని గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు. అతని భక్తిని పరీక్షించాలని పరమేశ్వరుడే ఇంద్రుని రూపంలో ప్రత్యక్షమవుతాడు. ఉపమన్యువును నీకేం కావాలన్నా ఇస్తాను కోరుకోమంటాడు. ఆ బాలుడు నువ్వెవరివి ? అని అడుగుతాడు. నేను దేవేంద్రుణ్ణి, దేవతల రాజును. దేవతలందరూ నా అధీనంలో ఉంటారు. నీకేం కావాలో చెప్పమంటాడు. అప్పుడు ఉపమన్యువు నేను ఈశ్వరుని కోసం తపస్సు చేస్తుంటే, నువ్వెందుకొచ్చావు ? నువ్వు ఇచ్చే ఇంద్రపదవైనా నాకొద్దు. శివుడు నాకు ఏదిస్తే అదే కావాలి, అది ఎలాంటిదైనా సరే, నాకు ఈశ్వరుడే ఇవ్వాలి అని చెప్పి, తపస్సు మొదలెట్టగానే ఈశ్వరుడు నిజరూపంలో దర్శనమిచ్చాడు. ఏ ఇతర భక్తులనూ అనుగ్రహించనంతగా అతనిని అనుగ్రహించి, పాల సముద్రాన్ని సృష్టించి ఇచ్చాడు. శివపార్వతులిద్దరూ ఆ బాలుడిని ఎత్తుకుని ముద్దాడారు. తమ కుమారునిగా భావించి కుమార పదవినిచ్చారు. ఐహికమైన సకల భోగాలు అనుభవించి, తన దగ్గరికి వచ్చేలా అనుగ్రహించారు. అదీ నిష్ఠ.
ఈ శ్లోకంలో జగద్గురువులు అదే చెప్తున్నారు. స్వల్పమైన ఫలాలననుగ్రహించే దేవుళ్ళు వెయ్యి మంది, అంటే అసంఖ్యాకులు ఉన్నా, వారెవరినీ కలలో కూడా ప్రార్ధించను, సేవించను, వారిని అనుసరించను, యాచించను. నీ పాదపద్మాలనే ఆశ్రయిస్తాను. 'యో బ్రహ్మాణం విదధాతి పూర్వం' - ఎవరు బ్రహ్మను ముందు సృష్టించారో అంటోంది వేదం. అంటే, బ్రహ్మను సృష్టించిన పరమాత్మ బ్రహ్మ కంటే ఉత్కృష్టుడు కదా ! అల్ప శక్తిమంతులిచ్చే ఫలం అల్పంగానే ఉంటుంది. 'అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్ప మేధసామ్'
సకల వైభోగాలతో ఉన్న దేవతలు, దేవేంద్రుడు కూడా ఈశ్వరుడు ఆనంద తాండవ నాట్యం చేస్తుంటే, ఆయన ఒంటి నుంచి రాలిపడిన బూడిద కణాలను శిరస్సులపైన ధరించటం చేత దైవత్వము, ఆయా పదవులు లభించి ఐశ్వర్యవంతు లయ్యారు. ' ఐశ్వర్యం ఈశ్వరాదిచ్ఛేత్ '. పరమమైన ఐశ్వర్యము మోక్షమే ! శివ సాన్నిధ్యమే ! ' సర్వం ఖల్విదం బ్రహ్మ ' జ్ఞానమే ! దీనినే ' ఈశావాస్యమిదం సర్వం ' అని ఉపనిషత్తు చెప్తోంది. సర్వమూ భగవంతుడే అని భావించి, సర్వమూ ఈశ్వరార్పణ చేస్తే, అదే భక్తి. ఆ భగవంతుడే తాను అని తెలుసుకోవటమే జ్ఞానము. జ్ఞానము అంటే ఎరుక. భక్తిలో పరవశత్వముంటుంది. పరమాత్మ భక్తి భావనలో మనస్సు లయిస్తుంది. మనో లయమే మోక్షము. కనుక మనం కూడా పరమ శివుని ప్రార్ధించి ఈశ్వరానుగ్రహం పొందుదాము.
ఈ శ్లోకంలో క్షుద్రఫలదాః అన్నారు. క్షుత్ అంటే ఆకలి. క్షుత్ ద్వారా - ఆకలితో, ఆకలి దప్పికలతో, అంటే లౌకికమైన భౌతిక వాంఛలతో కోరే కోర్కెలను తీర్చే దేవుళ్ళు అసంఖ్యాకంగా ఉన్నారు. నాకు వారితో పని లేదు. నాకు ఆ కోరికలు అక్కర్లేదు. విరించి, విష్ణుమూర్తి మొదలైన దేవతలందరూ ఏ నీ పాదపద్మాలను సేవించటం వల్ల శక్తి పొందుతున్నారో, ఆ నీ పదసేవే, శాశ్వత అలౌకికానందాన్నివ్వగలిగిన నీ పాదపద్మముల యందే నా బుద్ధి స్థిరంగా నిలిచి ఉండాలి. ఆ నీ పదసేవా భాగ్యం నాకు కావాలి.
ఇక్కడ క్షుద్రఫలదాః బదులు క్షిప్ర ఫలదాః అని కూడా పాఠాంతరం స్వీకరిస్తారు. క్షిప్ర అంటే వెంటనే, ప్రార్ధించిన వెంటనే, కోరిన వెంటనే కోర్కెలను తీర్చే దేవతలు అనే అర్ధం తీసుకోవచ్చును. క్షిప్రప్రసాదులైన క్షిప్ర గణపతి, క్షిప్రానుగ్రహ హనుమన్మంత్రాల లాంటివి మనకు ఉన్నాయి.
క్షుద్రఫలదాః అంటే మరొక అర్ధం భావించ వచ్చును. సాధకుడు సాధన చేస్తున్నప్పుడు అనేకమైన సిద్ధులు లభిస్తాయి. అవి శక్తిమంతములే అయినా పరమ ప్రయోజనం అది కాదు కనక వాటిని నేను కోరను, అటువంటి ఫలాలనిచ్చే దేవతలు నాకవసరం లేదు అని చెప్తున్నారని గ్రహించ వచ్చును.
ఒక్కో దేవత ఒక్కొక్క కోరికలను తీరుస్తారు, ఒక్కో ఫలాన్నిస్తారు. వినాయకుడు విఘ్నాలు పోగొడతాడు. సరస్వతీదేవి విద్యలను, శ్రీలక్ష్మీదేవి ధనాన్ని ఇలా స్వల్ప ప్రయోజనాలను తీరుస్తారు.
ఆ ఫలాలను ఇచ్చేది పరబ్రహ్మే అయినా, భక్తులు ఏ నామరూపాలతో ఉన్న దైవాన్ని తాము కోరే ప్రయోజనాలను సిద్ధింపజేయమని కోరితే, ఆ దేవతలు అవే తీర్చగలిగిన వారిలా వచ్చి ఆ కోరికలను తీరుస్తారు. అలా కాకుండా, ఆ నామ రూపాలలోని దైవమునే పరబ్రహ్మముగా భావించి కేవల నిశ్శ్రేయస్సునే కోరితే అప్పుడు క్షుద్రఫలం కాకుండా పూర్ణ ఫలం లభిస్తుంది. హే పరమేశ్వరా ! నీవు సర్వ కామ్యసిద్ధి ప్రదాతవు. అసలు కోరికలే లేని స్థితిని, సంపూర్ణ సంతృప్త స్థితిని అనుగ్రహిస్తావు. ఏది లభిస్తే ఇంక లభించ వలసినది ఉండదో దానిని అనుగ్రహిస్తావు. 'యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరం మమ' అని చెప్పిన ఆ నీ పదసేవా సదనాన్ని నాకు ప్రాప్తింప చేయమని ప్రార్ధిద్దాము.
🙏🙏🙏🌹
డా.విశాలాక్షి.

No comments:
Post a Comment