🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ప్రణవము.
----------------
ఓంకార బిందు సంయుక్తం
నిత్యం ధ్యాయంతి యోగినః !
కామదం మోక్షదం చైవ
ఓంకారాయ నమో నమః !!
ఓంకార బిందువుతో (బిందువుతో కూడిన ఓంకారముతో) యోగులు నిత్యము ధ్యానం చేస్తారు. సర్వ కామనలను తీర్చేది, మోక్షమును కలిగించేది అయిన ఓంకారమునకు నమస్కారము.
ఓంకారము కామదం, మోక్షదం. కనుక అన్ని ఆశ్రమముల వారికీ, ఎవరికి ఏది ఇవ్వాలో, వారికి వాటిని ఇవ్వగల శక్తి కలది ఓంకారము.
'ఓమిత్యేకాక్షరమిదం సర్వమ్' అని ఉపనిషత్తులు చెప్తున్నాయి.
సృష్టి స్థితి లయలకు మూల కారణమైన పరబ్రహ్మ వాచకము ప్రణవము. ప్రణవము అంటే ఓంకారము. ఓంకారంలోనుంచే సృష్టి అంతా ఆవిర్భవించిందని ఉపనిషత్తులు చెప్తున్నాయి.
మన కంటికి కనిపించేదంతా ఓంకారమే ! భూత భవిష్యద్వర్తమానాలలో ఉన్నది ఓంకారమే ! త్రికాలాతీత పరబ్రహ్మము ఓంకారమే !
కనుపించే విశ్వానికి మూలకారణమైన అదృశ్యం గా ఉండే పరతత్త్వాన్ని ఉపనిషత్తులు ఓంకారం అని ప్రతిపాదించాయి. ఓంకారము శబ్దబ్రహ్మము. విశ్వము ఉద్భవించినది ఓంకాలంలో నుంచే ! విశ్వమును - దాని పైకి వెళ్ళి వినగలిగితే, వినిపించే శబ్దం ఓంకారము. ప్రత్యక్ష పరబ్రహ్మ శ్రీసూర్యభగవానుని లో నుంచి అవిచ్ఛిన్నంగా వినిపించే నాదము ఓంకారమే నని ఎప్పుడో మన మహర్షులు చెప్పిన సత్యాన్ని ఇప్పుడు విజ్ఞాన శాస్త్ర వేత్తలు యంత్రాల సహాయంతో నిరూపించారు. ఓంకారమే సమస్త అక్షరముల సముదాయమని నిరూపించ బడింది. ఓంకారమే నిత్యము, సత్యము, సర్వమూ అనీ, జాగ్రత్ స్వప్న సుషుప్తులలో ఉంటూ, తురీయమైనది ఓంకారమేననీ, సృష్టి స్థితి లయలు ఓంకారమేననీ మాండూక్యోపనిషత్తులో నిరూపించారు.
ప్రపంచమంతా నామరూపాత్మకం. రూపం కంటికి కనిపిస్తుంది. దానికి ఒక నామం ఉంటుంది. ఆ నామం శబ్దము, ధ్వని. అది పుట్టింది ఓంకారం లోనుంచే ! 'నామము' 'నామీ' ని తెలియజేస్తుంది. నామము అంటే పేరు. నామీ అంటే, దేనికి ఆ పేరు ఉన్నదో, అంటే ఆ నామము ఏ వస్తువును సూచిస్తోందో, అది నామీ - నామము కలది. నామము ఓం, ఓంకారము - 'అ ఉ మ' లు. ఆ నామము చేత, అనగా ఓంకారము చేత తెలియబడేది నామీ - పరబ్రహ్మము.
మనం చూస్తున్న ఈ విశాల విశ్వంలోని నానాత్వానికి ఆధారంగా ఏదైనా మౌలిక పదార్ధం ఉన్నదా ? అదేమిటి ? అనే ప్రశ్నలకు సమాధానమే ఓంకారము. ఒక్క మూలాధార వస్తువుతో అనేక వస్తువులను తయారు చేస్తాము. ఒక్క బంగారంతో అనేకమైన పేర్లు కల అనేక రకాల ఆభరణాలను - గొలుసులు, గాజులు, దుద్దులు, ఉంగరాలు, ఒడ్డాణ్ణం, నెక్లెస్ లు ఇలా అనేక విధాలుగా తయారు చేస్తాము.
ఒక్క మూల పదార్ధమైన మట్టితో కుండలు, ముంతలు, కుండీలు, తొట్టెలు మొదలైనవి తయారు చేస్తాము. అలాగే ఒక్క ఓంకారం లోనుంచే నానాత్వం కలిగిన ఈ విశ్వం తయారయింది. 'వాచారంభణం వికారో నామధేయమ్ ! మృత్తికేత్యేవ సత్యమ్' ! అంటున్నది ఉపనిషత్తు. అలాగే 'అ ఉ మ' - లు ఓం లోనే ఉండి ఓంగా పరిణమిస్తున్నాయి.
అ కి ఉ కలిస్తే ఓ గా మారుతుంది అని చిన్న పిల్లలు కూడా తరగతి గదిలో సంధుల గురించి తెలుసుకుంటున్నారు కదా ! అ + ఉ = ఓ. దానికి 'మ్' చేరిస్తే, ఓమ్ అవుతుంది. అంటే ఒక్క 'ఓం' లో అ ఉ మ అనే అనేకం ఉన్నాయి కదా !
'అ అనటానికి నోరు తెరుస్తాము. అది సృష్టికి సంకేతం. 'ఉ' అంటున్నప్పుడు అది విస్తరిస్తోంది. అది స్థితి అన్నమాట. 'మ' ' మ్' అన్నప్పుడు తెరిచిన నోరు మూసుకు పోతోంది. అదే లయము. అంటే ఓంకారములోనే సృష్టి స్థితి లయలు ఉన్నాయి.
ఓం - ఒక్క అక్షరంగా, ఒక్క శబ్దంగా ఉన్నప్పుడు అది పరబ్రహ్మము. అవ్యక్త బ్రహ్మము. అందులో - ఆ ఉ మ లు అంతర్గతమై ఉన్నాయి. అవి బహిర్గతమైనప్పుడు, అదే శబ్ద ప్రపంచము, వ్యక్త బ్రహ్మము. అక్షరాలన్నీ అందులో నుంచే వచ్చాయి. అదే ఈ విశ్వము, సృష్టి. విశ్వము అనే సాధనంతో ఓంకారము అనే పరబ్రహ్మను తెలుసుకోవాలి. ఈ సర్వము అని ఏది చెప్పబడిందో, అది బ్రహ్మము. ఓంకారమే సర్వానికీ ఆశ్రయం. రెండింటికి భేదం లేదు. కనుక ఓంకారమును తెలుసుకుంటే, పరబ్రహ్మము తెలిసినట్లే !
రజ్జు సర్ప భ్రాంతి గురించి తెలుసు కదా ! తాడులో పాము ఆరోపించ బడింది. కనుక సర్పాది వికారాలకు ఆశ్రయం రజ్జువు. వాక్ ప్రపంచానికి ఆశ్రయం ఓంకారము. అయితే, అక్కడ ఉన్నది తాడు, భ్రాంతి పాము. ఇక్కడ ఉన్నది ఓంకారము, భ్రాంతి విశ్వము. ప్రాపంచిక శబ్దాలన్నీ ఓంకార వికారాలే ! ఓంకారము దారము. వాక్కు దారము. ఈ ప్రపంచమంతా ఆ దారంతో అల్లబడిన పూలమాల. ఓం ను ఆత్మతో అనుసంధానించాలి. ఓంకారంలో ఉన్న అ ఉ మ లు - స్ధూల సూక్ష్మ కారణ శరీరాలకు ప్రతినిధులు. అవి జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థలను చెప్తున్నాయి.
'అ' ని 'ఉ' లో కలిపి 'ఉ' ని 'మ' లో కలిపి 'అ ఉ మ' లు మూడింటిని బిందువులో లయం చేస్తే, మిగిలేది ఓంకారమే !
అలాగే, జాగ్రదవస్థను స్వప్నావస్థలో, స్వప్నావస్థను సుషుప్తిలో, సుషుప్తిని తురీయంలో లయం చేస్తే, తురీయమే మిగులుతుంది. ఓంకారమనే ప్రతీకతో పరబ్రహ్మమును ఈ మాండూక్యోపనిషత్తులో చెప్పారు.
మాండూక్యకారికలలో -
సర్వస్య ప్రణవోహ్యాదిః మధ్యమన్త స్తథైవచ!
ఏవం హి ప్రణవం జ్ఞాత్వా
వ్యశ్నుతే తదనంతరమ్ !!
అని చెప్పబడింది.
విశ్వమంతటికీ ఆది, మధ్య, అంతము కూడా ఓంకారమే ! దానిని తెలిసు కొనటం వలన పరమ ప్రయోజనం పొందగలడు.
ప్రణవం హీశ్వరం వింద్యాత్ స్సర్వస్య హృది సంస్థితం!
సర్వ వ్యాపినమోంకారం మత్వా ధీరో నశోచతి !!
సర్వప్రాణుల హృదయాలలో ఈశ్వరునిగా ఉన్నది ఈ ఓంకారమే అని గ్రహించాలి. సర్వవ్యాపి అయిన ఓంకారాన్ని గ్రహించగలిగితే ఇంక శోకమనేది ఉండదు.
కఠోపనిషత్తు లో యమధర్మరాజు నచికేతునికి చెప్తున్నాడు -
సర్వే వేదా యత్పదమామనన్తి !
తపాంసి సర్వాణి చ యద్వదన్తి !
యదిచ్ఛన్తో బ్రహ్మ చర్యం చరన్తి
తత్తే పదం సంగ్రహేణ బ్రవీమ్యోమిత్యేతత్ !!
సమస్త వేదములు ఏ వస్తువును లక్ష్యంగా చెప్తున్నాయో, చాంద్రాయణాది రూపములగు తపస్సులన్నీ ఏ వస్తువును పొందటమే ప్రయోజనంగా కలిగి ఆచరింపబడుతున్నాయో, ఏ వస్తువును కోరి బ్రహ్మచర్యము నవలంబించుచున్నారో, అట్టి పరమ పదమును గురించి సంగ్రహముగా చెప్పుచున్నాను. ఆ పరమ పదమే ప్రణవము - ఓంకారము.
ఏతద్ధ్యేవాక్షరం బ్రహ్మ ఏతద్ధ్యేవాక్షరం పరం !
ఏతద్ధ్యేవాక్షరం జ్ఞాత్వా యో యదిచ్ఛతి తస్య తత్ !!
ఆ అక్షరమే బ్రహ్మ, ఆ అక్షరమే అన్నింటి కంటే గొప్పది. ఈ అక్షర పరబ్రహ్మమును తెలుసుకున్న వారికి సర్వ కార్యములు సిద్ధించును.
ఓంకారములో 'అ ఉ మ' లు స్ధూలంగా కనిపిస్తాయి. కనుపించకుండా అంతర్గతంగా - అ ఉ మ లతో పాటుగా - బిందు, నాద, కళ, కళాతీత, పరాత్పర - అనే అంశాలు కూడా ఉన్నాయని తారసారోపనిషత్తులో చెప్పారు. అక్కడ
పరివార రామచంద్రమూర్తిని ఓంకారంతో చెప్పారు.
శ్రీరామోత్తరతాపిన్యుపనిషత్తులో కూడా ప్రణవ మందు అకార, ఉకార, మకార, అర్ధమాత్ర, బిందువు, నాదము అనే ఆరు భాగములు ఉన్నాయనీ, ఈ ఆరు భాగములు కలిగిన ఓంకారమే తారక మంత్రమనీ, ఈ తారక మంత్ర వాచ్యుడు శ్రీరామచంద్రుడని చెప్పారు.
అమృతనాదోపనిషత్తులో కూడా - సర్వ సంగ పరిత్యాగులైన యోగులు ఏ విధంగా తరించాలో చెప్పారు.
'ఓమిత్యేకాక్షరం బ్రహ్మ, ఓమిత్యేతేన రేచయేత్, దివ్య మంత్రేణ బహుధా కుర్యాదామల ముక్తయే ...'
ఏకాక్షరమును పరబ్రహ్మ స్వరూపమును నగు ఓంకారముతో బ్రహ్మ ధ్యాన పూర్వకముగా రేచకము సలుపాలి.ఈ విధంగా పలుమార్లు రేచక పూరకములు చేస్తూ, మనస్సులోని మాలిన్యాలను నశించి పోయే వరకు ప్రాణాయామములను చేస్తూ ఉండాలి. ఇలా చెప్తూ, ఓంకారమును ఇలా చెప్తారు.
" అఘోష మవ్యంజనమస్వరం చ యత్తాలు దంతోష్ఠ సునాసికం చ యత్ ! అరేఫజాత ముభయోష్మ వర్జితం యదక్షరం న క్షరతే కథంచిత్ !
యేనా2సౌ గచ్ఛతే మార్గం ప్రాణం తేనాభిగచ్ఛతి, అతస్తమభ్యసేన్నిత్యం యన్మార్గ గమనార్హం వై ...'
ఆ అక్షరము (ఓంకారము) ఘోష లేనిది, వ్యంజనము కానిది, స్వరము లేనిది, తాలువులు, దంతములు, నాసిక - వీటితో సంబంధము లేనిది, నశించనిది. ఈ ప్రణవము పయనించే మార్గాన్ని అనుసరించి ప్రాణవాయువు పయనిస్తుంది. ప్రాణవాయువు ఏ మార్గంలో చరిస్తుందో, ఈ అక్షరము కూడా అదే మార్గంలో పయనిస్తూ ఉంటుంది. అటువంటి ప్రాణాయామ మార్గాన్ని నిత్యము అభ్యాసం చెయ్యాలి. హృదయ ద్వారము, వాయు ద్వారము, బ్రహ్మరంధ్ర ద్వారము ఇవన్నీ మోక్ష ద్వారములు.
ఒక ప్రతిమలో భగవంతుని భావించి, ఉపాసిస్తున్నట్లుగానే, బ్రహ్మ ప్రతిపత్తికి ఓంకారము ఆలంబనం.
ఓంకారమును జపిస్తున్నా, ఓంకార సహిత మంత్రాన్ని జపిస్తున్నా, మనలోని చైతన్యము విశ్వ చైతన్యంతో అనుసంధానించ బడుతుంది. సాధనతో మనమే విశ్వ చైతన్యముగా మారగలుగుతాము.
ఏ మంత్రానికైనా ముందు ఓంకారం ఎందుకు పెడతామంటే - తస్య వాచకః ప్రణవః అని శ్రుతి చెప్తోంది కదా ! పరబ్రహ్మ వాచకము ప్రణవము - ఓంకారము. ఉన్నది ఒకే ఒక్క పరతత్వము. ఆ ఉన్న ఒక్క తత్త్వాన్నే అనేక నామరూపాలతో ఆరాధిస్తాము. కనుక ఏ దైవాన్ని ఆరాధిస్తున్నా, ఓంకారంతో కలిపి చెప్పేటప్పటికి ఆ మంత్రం పరబ్రహ్మదవుతుంది, పరమాత్మను ఆరాధించినట్లవుతుంది. ఇన్ని నామరూపాలతో మనం ఆరాధిస్తున్నది ఒకే ఓంకార వాచ్యుడైన పరమాత్మను అనే జ్ఞానం కలుగుతుంది. నామరూపాలే భిన్నం. భవంతుడు ఒక్కడే అన్న సత్యం బోధ పడుతుంది.
ఓంకారాన్ని జపిస్తున్నా, ఉపదేశించ బడిన మంత్ర జపం చేస్తున్నా, మన మహర్షులు బోధించిన పతంజలి రాజయోగ సాధన చేసినా, సాధనా బలం పెరుగుతుంటే, మన శరీంలోని మూలాధార చక్రంలో నిద్రాణ స్థితిలో ఉన్న కుండలినీ శక్తి ప్రేరేపించబడి, షట్చక్రముల ద్వారా పైకి వ్యాపిస్తూ, సహస్రార చక్రాన్ని చేరి బ్రహ్మానందాన్ని అనుభవిస్తుంది.
🙏🙏 ఓం తత్సత్ 🙏🙏
రచన :
డా.టి.(ఎస్)విశాలాక్షి
సెల్ నంబర్ - 9966529033
వాట్శాప్ నంబర్ - 9963964033.
🙏🌹